![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -105 లో... రామలక్ష్మి వెళ్తుంటే.. నీకు మంచి భర్త దొరికాడు. అతని చెయ్యి మాత్రం ఎప్పుడు వదలకని సుజాత చెప్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి వాళ్ళు బయటకు వెళ్తారు. సీతాకాంత్ తో సుజాత మాట్లాడుతుంది. రామలక్ష్మి ఎందుకు బాధపడుతుంది. ఎందుకు చెప్పండి అని అడుగుతుంది. తను మీపై బెంగ పెట్టుకుందని సీతాకాంత్ చెప్తాడు. అది కాదని నాకర్థమవుతుందని సుజాత అనగానే.. మీ కూతురు గురించి మీరు టెన్షన్ పడకండి. నేను తనకి కష్టం రాకుండా చూసుకుంటానని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు బయల్దేరి వెళ్ళిపోతారు. సీతాకాంత్ , రామలక్ష్మి ఇంటికి వెళ్తారు. డోర్ వరకు వచ్చేసరికి అప్పుడే సీరియల్ చూస్తుంటుంది శ్రీవల్లి. పెళ్లి కాకుండా పెళ్లి చేసుకున్నారని యాక్టింగ్ చేస్తున్నారా? ఆ తర్వాత ప్రేమించినవాడు మోసం చేశాడా అని శ్రీవల్లి అంటుంటే.. వాళ్ళ గురించి ఏమోనని సీతాకాంత్, రామలక్ష్మి టెన్షన్ పడతారు. అప్పుడే శ్రీలత వచ్చి.. నీ సీరియల్ పిచ్చి ఏంటని తనపై కోప్పడుతుంది. కాసేపటికి రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు లోపలికి వస్తారు. ఎక్కడకి వెళ్లారని శ్రీలత అడుగుతుంది. రామలక్ష్మి వాళ్ళింటికి వెళ్ళామని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి ఇల్లు ఇది కదా.. నువ్వు పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి తన ఇల్లు ఇదేనని శ్రీలత అంటుంది. మీరు ఎందుకో బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే నాతో చెప్పండి.. ఎందుకంటే సీతాకాంత్ బాధపడితే నేను చూడలేనని శ్రీలత అంటుంది. అమ్మకి ఒకవేళ మేమ్ పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడుతున్నామని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని సీతాకాంత్ అనుకుంటాడు..
మరొకవైపు మాణిక్యం రెడీ అయి ఆఫీస్ కి వెళ్తుంటే సుజాత వచ్చి.. ఎందుకు రామలక్ష్మి బాధపడుతుంది. ఆ బాధకి ఆ అభి కారణం కావచ్చు అదేదో తెలుసుకోండి అని మాణిక్యంతో సుజాత చెప్తుంది. ఆ తర్వాత సందీప్, శ్రీలత ఇద్దరు రామలక్ష్మిని సీతాకాంత్ లని దూరం చెయ్యడానికి ప్లాన్ చేస్తారు. మరోవైపు రామలక్ష్మి డల్ గా ఉంటే సీతాకాంత్ వచ్చి.. దాని గురించి మర్చిపోమని చెప్పాను కదా అని అంటాడు. ఇన్ని రోజులు అభి వచ్చే వరకు ఇక్కడ ఉండాలని అనుకున్నాను.. ఇప్పుడు తను రాడు.. ఇక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి.. ఎక్కడికైన వెళ్ళిపోతానని రామలక్ష్మి అంటుంది. నా కోసం ఇక్కడే ఉండు.. నాకు ఇంత హెల్ప్ చేసావ్.. నీకు కష్టం వస్తే ఎలా వదిలేస్తానని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |